రోజుకి నాలుగుగంటల నిద్ర…రాజకీయం లో 50 ఏళ్ళ ముద్ర.
దశాబ్దాలుగా పార్టీ ని నడిపే చాకచక్యం… దేశం మెచ్చిన చాణక్యం.
ఆంధ్రా కి బ్రాండు… అంతా వెరసి 75 యేళ్ళ ఒకే ఒక్కడు..!
‘kill the boy… let the man be born’ అని నీకు నువ్వు చెప్పుకుని 20 ల్లో వచ్చావ్…. ఇప్పుడు 75 వచ్చేశాయ్!
75 ఏంటి .. సెంచరీ ఆయువు నీది. సంకల్పం లేనోడు ఎప్పుడూ సాధారణ మనిషే. ఒక మనిషికి సంకల్పమే ఉంటే అది నేను చూసే నువ్వనిపిస్తది. మీ నుండి చూసి నేర్చుకోవాల్సిందే, చాలా ఉంది. wisdom అంటే వీలైనంత ఎక్కువ తెలుసుకోవటమే… ఎందుకంటే మనకి ఎంత ఎక్కువ తెలిస్తే, మనకి మనం అంత చిన్నగా అనిపిస్తాం. నా రిఫరెన్స్ నువ్వు… కదిలే శిఖరం నువ్వు. అందుకే పుస్తకాల్ని చూసి కాదు, నిన్ను చూసి చాలా నేర్చుకుంటున్నా… ఇంటర్నేషనల్ వేదికల మీద కాలు మీద కాలు వేస్కుని కూచునే 75 యేళ్ళ నలగని ఖద్దరు చొక్కా వి.. చుక్కాని వి…!!
నా తరానికి మీ నుండి perseverance, resilience అనే వాటి మీద పాఠాలు ఇంకా కావాలి. నీ లక్ష్యం, ఉత్సాహం తెలిసినోడికి, ముప్పాతిక ఏళ్ళ ముసలి శరీరం చూసి జాలి కాదు… ‘కాళి’ పుడతది. శిఖరం తలొంచితే ఎలా ఉంటదో నీలో చూశాను, చూస్తున్నాను. ఆలా తలొంచటం తక్కువ అనిపిస్తంది చాలా మందికి. తలొంచటం పాఠం కాదు, ఎందుకు వంచావు అనేది ‘పాఠం’. అన్నీ నేర్చుకుంటున్నా … ఇంకో పాతికేళ్ల సిలబస్ పెండింగ్ ఉంది పెద్దాయనా…. నా మటుకు నేను నేర్చుకోటానికి సిద్దంగానే ఉన్నా…
అంతః కరణ శుధ్ధితో …!!
No responses yet