నీరసంగా నిట్టూరుస్తున్న జాతిలో, ఒళ్ళు విరుచుకున్న ఉత్తేజాన్ని…
అబద్ధాన్ని వివస్త్రగా చూసి నవ్వుకునే నిజాన్ని…
ఎంత కిందపడేయాలనుకున్నా బెదరని ‘ఎదురు’ ని…
ఒక్కోసారి ఆలోచనల సమూహాన్ని… సంగ్రామాన్ని…
అంతలోనే నాకు నేనే అర్ధంకాని అగమ్యగోచరాన్ని… అంతర్మధనాన్ని…!
నాలో నేను, నాకు మాత్రమే వినపడే..
స్వరాన్ని..గళాన్ని…
ఉన్మాదాన్ని…ఉద్యమాన్ని…
ప్రేమికుడ్ని… స్వయం ప్రేరణ ని..
ఆపని ప్రయత్నాన్ని…నిరంతర ప్రశ్నని..
ఒక్కోసారి అక్షరంగా శిధిలమయ్యే ఆలోచనని…!
నా పిచ్చిని తీర్చే Dopamine కోసం నిరంతర అన్వేషిని…!!
– నాని
No responses yet