I think….

నా తెలుగు డిక్షనరీ లో vocabulary ని upgrade చేసుకోవాల్సిన టైం వచ్చింది. రాతల్లో, వాడుక భాషలో ఎక్కడో వెనకపడ్డాననిపిస్తుంది. ఒక అమెరికా ‘అమ్మ’ తన ఇద్దరు ఇద్దరు 15+ మగ పిల్లల్ని ఎలా పెంచాలి అనే backdrop లో ‘దెంగేయ్…చెత్త నా కొడకా..’ అనే HIT మూవీ BGM తో పెట్టిన వీడియో చూసేదాకా నాక్కూడా అర్ధం కాలేదు నేనెంత వెనకపడ్డానో…! ఈ ‘దెంగేయ్’ అనే పదం hesitate అవుతూ బయటకి రావటం ఈ రోజు వరకు నేను చూడలేదు… infact, ప్రతి ఒక్కళ్ళ నోళ్ళల్లో మీసాలు తిప్పుకుంటూ, కాలు మీద కాలేసుకుని కూచున్న proud వర్డ్. పల్లెటూరోడి గొంతులో మెట్టగా, అమెరికా వాడి గొంతులో క్లాసుగా పలకొచ్చేమో కానీ, స్మెల్, టేస్ట్ & ఎమోషన్… సేమ్ టు సేమ్. అయినా ఇక్కడ ఎవడి ‘సెన్సార్’ కళ్ళకి గంతలు కట్టాలని, ‘దెంగేయ్’ కి ‘మింగేయ్’ అనే substitute వాడతన్నారో ఒక్కోసారి అర్ధం కాదు. దాని మీనింగ్ ఏ అమ్మాయికి, అబ్బాయికి తెలియదని…? తెలుగేమో ఇది నా ‘భాష’ అని అక్కున చేర్చుకుంది. Youth ఏమో ‘Attitude’ flavour కోసం ‘సరదా’గా వాడేసుకుంటుంది. సమాజం ఏమో ఇది ‘భావ స్వేచ్ఛ’లే అని వదిలేసింది.

Just imagine… ఒకబ్బాయి అలా ‘Thar ‘ మీద కూర్చుని.. ఎవడికో పిల్ల వార్నింగ్ ఇచ్చి, చివర డైలాగ్ గా ఈ ‘దెంగెయ్…’ పదంతో ఫినిషింగ్ టచ్ ఇచ్చి, అలా ఒక ఆటిట్యూడ్ తో పక్కకి తిరిగి స్టైలిష్ గా, cigerrate తో లాంగ్ దమ్ము లాగి, బయటకి వదులుతూ, లాంగ్ హెయిర్ ఆలా సరిచేసుకుంటంటే…ఆ సీన్ ని ultra slow motion లో కెమెరా తో capture చేస్తే’… ఆ డైరెక్టర్ కి హోల్ సీన్ పండినట్టే… చూసిన అమ్మాయిల కళ్ళకి ఒక ‘హీరో’ దొరికేసినట్టే…! By the way, క్యారెక్టర్ elevation కి, boldness ఫార్ములా కి, చిట్టి చిట్టి అడుగులు వేయటం నేర్పిన పదం ఇది…!… 🙂 ఒక వేళ ఇది మీకు తప్పనిపిస్తే మీ OS (ఆపరేటింగ్ సిస్టమ్) షెడ్డుకొచ్చింది అని రియలైజ్ అయ్యి, upgrade చేసుకోండి.

ఈ పదం గురించి ఇంత రాసి… పద్దతిగా ఉంటాను అని మెల్లగా చెప్పటం ‘సభా మర్యాద’ కాదు… అందుకే,

చదివింది చాల్లే darling…ఛల్ ‘దెంగేయ్’…!!!

#

Comments are closed